: దక్షిణ ఢిల్లీలో 'నిర్భయ డాక్యుమెంటరీ' స్క్రీనింగ్... ఎఫ్ఐఆర్ నమోదు
భారత్ లో 'నిర్భయ డాక్యుమెంటరీ'ని ప్రసారం చేసేందుకు ఢిల్లీ హైకోర్టు ససేమిరా అన్నప్పటికీ దొంగచాటుగా ఆ చిత్రాన్ని దేశరాజధానిలో కొంతమంది చూశారు. దక్షిణ ఢిల్లీలోని ఆర్ కే పురంలో ఉన్న రవిదాస్ క్యాంప్ వద్ద నిర్భయ డాక్యుమెంటరీని పోర్టబుల్ స్క్రీనింగ్ వేశారు. దాన్ని అక్కడి 50 మంది నివాసితులు నిన్న (గురవారం) రాత్రి చూశారు. దాంతో ఢిల్లీ పోలీసులు చూసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక్క భారత్ తప్ప మిగతా అన్ని దేశాల్లో ఈ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టు ముందు ఉన్నందున, డాక్యుమెంటరీ నిషేధం ఎత్తివేతపై నిర్ణయం తీసుకోలేమని ఢీల్లీ హైకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే.