: మెరుగుపడుతున్న కేజ్రీవాల్ ఆరోగ్యం... ఈ నెల 16న ఢిల్లీకి


ఈ నెల 5న బెంగళూరు వెళ్లి దగ్గు, మధుమేహానికి ప్రకృతి వైద్యం తీసుకుంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన మధుమేహ స్థాయి తగ్గుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. దాంతో పాటు దగ్గు కూడా 75 శాతం తగ్గిందని వైద్యులు చెప్పారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 16న కేజ్రీ తిరిగి ఢిల్లీ వస్తారని వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ప్రకృతి చికిత్సతో పాటు కేజ్రీవాల్ యోగా కూడా చేస్తున్నారట. దానికి సంబంధించిన ఫొటోలు ఆంగ్ల పత్రికలు, వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News