: ఇంగ్లాండ్, ఆఫ్ఘన్ మ్యాచ్ కి వరుణుడి అడ్డంకి
సిడ్నీలో ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ ల మధ్య జరుగుతున్న వన్డే పోరుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఇప్పటికి రెండుసార్లు వర్షం పడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్ జట్టు 25 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. షఫీక్ 32 బంతుల్లో 10, నాసిర్ జమాల్ 50 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో వర్షం మొదలు కావడంతో మ్యాచ్ ని అంపైర్లు నిలిపివేశారు. ప్రస్తుతం భారీ వర్షం పడుతూ ఉండడంతో ఓవర్లను కుదించే అవకాశాలు ఉన్నాయి.