: డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు వినిపించరా?... జగన్ కేసుపై సీబీఐ న్యాయమూర్తి అసహనం


వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ నేడు సీబీఐ కోర్టు ముందుకొచ్చింది. విచారణకు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ ఆడిటర్ విజయసాయి రెడ్డి, పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసు విచారణలో భాగంగా వాదనలపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కేసులో దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ఎక్కడని న్యాయమూర్తి ప్రశ్నించారు. పిటిషన్లను దాఖలు చేస్తే సరిపోతుందా? వాదనలు వినిపించరా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పిటిషన్లపై ఈ నెల 16న వాదనలు వినిపించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జగన్ అక్రమాస్తుల కేసు విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News