: నిరసన తెలపడానికి కూడా మాకు అవకాశం ఇవ్వరా?: వైఎస్ జగన్


ఏపీలో ఇన్ పుట్ సబ్సిడీ విషయంలో రైతులను నట్టేట ముంచారంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రశ్నలు వేయకుండా, నిరసన మాత్రమే తెలియజేయాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరారు. అయినా జగన్ వినకుండా ఓ ప్రతిపక్షంగా తామేదైనా మాట్లాడతామనడంతో స్పీకర్ కొంత అసహనానికి గురై మాట్లాడేందుకు అనుమతివ్వలేదు. దాంతో తమకు నిరసన తెలిపేందుకు కూడా సమయం ఇవ్వరా? అని జగన్ ప్రశ్నించారు. ఈ సమయంలో వైసీపీ సభ్యులు సభలో గందరగోళం చేయడంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News