: తడబడ్డా నిలబడి సత్తా చాటిన బంగ్లా పులులు... న్యూజిలాండ్ లక్ష్యం 289


అండర్ డాగ్స్ గా బరిలోకి దిగి ఇంగ్లాండ్ ను ఇంటికి పంపి క్వార్టర్ ఫైనల్స్ లో స్థానం సంపాదించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు అత్యంత బలమైన న్యూజిలాండ్ జట్టుతో నేడు జరుగుతున్న క్రికెట్ పోటీలో విరుచుకుపడ్డారు. తడబడ్డా నిలదొక్కుకొని ఆడుతున్నారు. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న మహ్మదుల్లా సెంచరీ చేయగా, సౌమ్యా సర్కార్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మొత్తం 123 బంతులను ఎదుర్కొన్న మహ్మదుల్లా 12 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 128 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. మరికాసేపట్లో 289 పరుగుల విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News