: సభలో రగడ... బయట లాఠీచార్జీ... కేరళలో ఉద్రిక్త పరిస్థితులు


కేరళలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేటి ఉదయం ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. సభలో విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతుండగా, బయట విపక్ష పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. లాఠీ చార్జీ చేశారు. పోలీసుల లాఠీచార్జీలో పలువురు గాయపడ్డట్టు సమాచారం. పోలీసుల లాఠీ చార్జీపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష పార్టీల కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.

  • Loading...

More Telugu News