: బైకు కోసం కన్న బిడ్డను కిడ్నాప్ చేసిన తండ్రి


అత్తగారింట్లో వున్న తన బైకును తెచ్చుకునేందుకు సొంత కొడుకునే కిడ్నాప్ చేశాడో తండ్రి. ఈ ఘటన నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేవ్లా తండాకు చెందిన సోనా, దేవ దంపతులకు ఇద్దరు కొడుకులు. భర్తతో రోజూ గొడవ పడలేక భార్య సోనా ఐదేళ్ల క్రితం తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. మూడేళ్ల క్రితం భార్యను పంపాలని వచ్చి అడిగిన సమయంలో తన మోటార్ సైకిల్‌ ను అత్తారింటి దగ్గరే వదిలేసి వెళ్లాడు. తన బైకు తనకివ్వాలని పలుమార్లు అడిగినప్పటికీ వారు ఇవ్వలేదు. ఈ క్రమంలో మాదాపూర్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న అతని పెద్ద కుమారుడు వెంకటేశ్‌ ను దేవ బలవంతంగా తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన స్థానికులు సోనీకి సమాచారం ఇచ్చారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దేవను అదుపులోకి తీసుకొని విచారించగా, తన బండి కోసమే కుమారుడిని కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని చెప్పడంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది.

  • Loading...

More Telugu News