: స్నాప్ డీల్ పై అలీబాబా కన్ను!
ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ సేవలందిస్తున్న సంస్థ అలీబాబా, ఇండియా కేంద్రంగా పనిచేస్తున్న స్నాప్ డీల్ లో వాటాలను కొనాలని భావిస్తోంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కనీసం 500 నుంచి 700 మిలియన్ డాలర్ల మేరకు (సుమారు రూ. 3,100 కోట్ల నుంచి రూ. 4,379 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు అలీబాబా ఆసక్తి చూపుతోంది. ఇరు సంస్థల మధ్య డీల్ కోసం ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ ఒప్పందంపై వ్యాఖ్యానించేందుకు రెండు కంపెనీల ప్రతినిధులు నిరాకరించారు.