: ఇక హస్తిన చెంతకు... మూడు రోజుల కేసీఆర్ హస్తిన పర్యటన నేటితో మొదలు!
లక్ష కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కారు, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక కేటాయింపులు, రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధుల విడుదల, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం తదితరాల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న కేసీఆర్... ప్రధాని మోదీ, కేంద్ర కేబినెట్ మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు సత్వర అనుమతులతో పాటు మరింత మేర నిధులను విడుదల చేయాలని ఆయన ప్రధానిని కోరనున్నారు. మూడు రోజుల పర్యటనను ముగించుకుని ఆదివారం సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాదు బయలుదేరనున్నారు.