: తండ్రి కాబోతున్న క్రికెటర్ శ్రీశాంత్
ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఇరుక్కుని కెరీర్లో వెనకబడిపోయిన క్రికెటర్ శ్రీశాంత్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ అందుకోబోతున్నాడు. మే నెలలో తన భార్య ప్రసవించనుందని శ్రీశాంత్ తెలిపాడు. ప్రస్తుతం తాను సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తున్నానని, మే నెలలో ఎటూ కదిలేది లేదని, భార్య చెంతనే ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. పుట్టబోయేది అబ్బాయా? అమ్మాయా? అన్న విషయం ఏమంత ముఖ్యం కాదని, తండ్రి హోదా ఎప్పుడెప్పుడు దక్కుతుందా? అని ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. శ్రీ ప్రస్తుతం పూజా భట్ సినిమా 'కాబరే'లో నటించేందుకు సంతకం చేశాడు. ఆ ప్రాజెక్టు తర్వాత ఆదిత్య అతుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు; తెలుగు, మలయాళం సినిమాల్లోనూ నటించనున్నట్టు తెలిపాడు.