: మా ఇద్దరికీ సిగ్గే... నటుడ్ని కాకముందే గోపీ హీరో: ప్రభాస్
సినీ నటుడ్ని కాకముందే హీరో గోపీచంద్ ను కలిశానని ప్రభాస్ చెప్పాడు. గోపీచంద్ నటించిన 'జిల్' సినిమా ఆడియో వేడుకకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిసారి గోపీచంద్ ను సినిమా ఆఫీస్ లో కలిశానని, అప్పుడు ఇద్దరం సిగ్గుపడుతూనే మాట్లాడుకున్నామని తెలిపాడు. 'వర్షం'లో నటించడం ప్రారంభించిన తరువాత ఇద్దరం స్నేహితులమయ్యామని వెల్లడించాడు. సినిమాల గురించి మామూలుగా మాట్లాడుకుంటామని, 'చక్రం' సమయంలో జనాలకి నచ్చేలా సినిమాలు తీయాలని గోపీ చెప్పాడని ప్రభాస్ చెప్పాడు. నీ అందం రహస్యమేంటని గోపీచంద్ ని ప్రభాస్ ప్రశ్నించాడు. "వాడికీ తెలుసు... వాడు కూడా మెయింటెయిన్ చేస్తున్నాడు కదా" అని గోపీచంద్ సమాధానమిచ్చాడు.