: రాహుల్ ఏకాంతాన్ని గౌరవించాలట!


రాహుల్ గాంధీ సెలవుపై వెళ్లడాన్ని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు మండిపడ్డాయి. ఆయన ఏకాంతాన్ని గౌరవించాలని పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జీవాలా సూచించారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దంటూ మీడియా మిత్రులను కోరుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు నూతన జవజీవాలు అందించేందుకు రాహుల్ గాంధీ పడుతున్న తాపత్రయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. ఆయన విషయంలో తాజా సమాచారం తెలిస్తే వెంటనే మీడియాకు తెలియపరుస్తామని సూర్జీవాలా స్పష్టం చేశారు. తాజా పార్లమెంటు సమావేశాలకు ముందే సెలవు పేరిట వెళ్లిన రాహుల్ గాంధీ, మరలా తన సెలవును పొడిగించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News