: స్వైన్ ఫ్లూ పై భారత వైద్య ఆరోగ్య శాఖ నివేదికకు విరుద్దంగా ఎమ్ఐటీ సర్వే ఫలితాలు
స్వైన్ ఫ్లూ పై భారత వైద్య ఆరోగ్య శాఖ నివేదికకు విరుద్ధంగా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఐటీ) సర్వే ఫలితాలు ఉన్నాయి. భారత్ లో స్వైన్ ఫ్లూ ప్రమాదస్థాయిని దాటిపోయిందని ఎమ్ఐటీ స్పష్టం చేసింది. గతేడాది డిసెంబర్ వరకు స్వైన్ ఫ్లూ కారణంగా 1500 మంది మృతి చెందారని సర్వే తెలిపింది. ఇప్పటికైనా భారత్ అప్రమత్తం కాకపోతే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని ఎమ్ఐటీ హెచ్చరించింది.