: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కాగ్ నివేదిక
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కాగ్ నివేదిక విడుదల చేసింది. కాగ్ నివేదికను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అకౌంటెంట్ జనరల్ అందజేశారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాగ్ నివేదికను అసెంబ్లీ ముందు పెట్టనున్నాయి. ఆ నివేదికల్లో ఏముందోనని సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో, కాగ్ నివేదికలు ప్రభుత్వాల అవకతవకలను ఎండగట్టడం తెలిసిందే.