: చనిపోయిన కోచ్ కు నివాళిగా మ్యాచ్ నెగ్గాలంటున్న యూనిస్ ఖాన్


ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ లో తప్పక నెగ్గాలని పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్ మన్ యూనిస్ ఖాన్ సహచరులకు పిలుపునిచ్చాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి దివంగత కోచ్ బాబ్ ఊమర్ కు నివాళి అర్పించాలని సూచించాడు. ఆదివారం ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ ఓ రకంగా పాక్ జట్టుకు చావో రేవో మ్యాచ్ వంటిది. ఈ పోరులో గెలిస్తే క్వార్టర్స్ బెర్తు ఖాయమవుతుంది. అందుకే సర్వశక్తులు ఒడ్డయినా మ్యాచ్ ను నెగ్గాలని యూనిస్ భావిస్తున్నాడు. ఈ పోరు తమకు చాలా ముఖ్యమైనదని, బాబ్ ఊమర్ పాక్ క్రికెట్ కు విశేష సేవలందించాడని తెలిపాడు. 2004లో పాక్ క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టిన ఊమర్ 2007లో కరీబియన్ దీవుల్లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీ సందర్భంగా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అయితే, దర్యాప్తు అనంతరం, సహజ కారణాలతోనే అతడు మరణించాడని జమైకా పోలీసులు తేల్చారు.

  • Loading...

More Telugu News