: టీటీడీ వనంలో గజరాజుల విధ్వంసం
తిరుమల తిరుపతి దేవస్థానం పెంచుతున్న శ్రీ గంధం వనంలోకి ఏనుగుల గుంపు చొరబడింది. పార్వేటి మండపం దగ్గర్లోని ఈ వనంలో ఉన్న శ్రీగంధం, కొబ్బరి చెట్లను గజరాజులు ధ్వసం చేశాయి. నీటిపైపులను లాగి పడేశాయి. నాలుగు ఏనుగులు, ఓ గున్న ఏనుగు వనంలో ప్రవేశించినట్టు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 5 కోట్ల రూపాయలతో ఈ వనాన్ని పెంచుతోంది. శ్రీవారి సేవలకు అవసరమైన శ్రీగంధంను ఇక్కడి నుంచే సేకరించాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. శ్రీవారి సేవల నేపథ్యంలో, ప్రతి ఏటా శ్రీగంధం కొనుగోలుకు టీటీడీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోన్న సంగతి తెలిసిందే.