: మందలింపు కాదు... చేతనైతే ఉరితీయండి: కట్జూ సవాల్
రాజ్యసభలో తన వ్యాఖ్యలను ఏకగ్రీవంగా ఖండించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తీవ్రంగా స్పందించారు. విదేశాల్లో ఉన్న ఆయన దీనిపై మాట్లాడుతూ, ఖండిస్తూ తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదని, చేతనైతే తనను ఉరితీయాలని అన్నారు. తనకు వస్తున్న ఆర్థిక, ఇతరత్రా ప్రయోజనాలను కూడా నిలిపేయాలని సూచించారు. అలా నిలిపేయాలంటే నిబంధనలు సవరించాలని, తాను సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జినన్న విషయం మరువొద్దని ఆయన తెలిపారు. తాను విదేశాల నుంచి తిరిగి రాగానే అరెస్టు చేసి, ఉరితీయాలంటూ ఎంపీలు ఓ తీర్మానం ఆమోదించాలని ఆయన అన్నారు. కాగా, ఇంతకుముందు ఆయన మాట్లాడుతూ గాంధీ బ్రిటిష్ ఏజెంట్ అని, చంద్రబోస్ జపనీస్ లా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభ తీర్మానం చేసింది.