: లోటు పూడ్చుకునేందుకు పన్నులు పెంచుతారేమో!: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ లో లోటుబడ్జెట్ ను పూడ్చుకునేందుకు ప్రజలపై పన్నుల భారం మోపుతారేమోనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చాంద్ బాషా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె.శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సింగపూర్ లాంటి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామంటున్న చంద్రబాబు కేవలం రూ.3 వేల కోట్లు కేటాయించడాన్ని వారు తప్పుబట్టారు. డ్వాక్రా రుణమాఫీ ఊసెత్తలేదని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ప్రతి నిరుద్యోగికీ భృతి కల్పిస్తామన్న బాబు, బడ్జెట్ లో దాని ప్రస్తావనే తేలేదని విమర్శించారు. గృహనిర్మాణానికి కేటాయింపులు ఏవని వారు ప్రశ్నించారు.