: మారిషస్ లో మోదీ ప్రత్యేక పూజలు


ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన కొనసాగుతోంది. సీషెల్స్ నుంచి మారిషస్ చేరుకున్న ఆయన నిన్న (బుధవారం) రాత్రి అక్కడి అధినాయకత్వంతో చర్చలు జరిపారు. ఈ ఉదయం ఆయన మారిషస్ లో అత్యంత పవిత్రమైన హిందూ క్షేత్రంగా భావించే 'గంగా తలావో'ను సందర్శించారు. ఈ శైవ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. సవన్నే జిల్లాలో ఉన్న ఈ దేవాలయం సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఓ పర్వతంపై కొలువుదీరి ఉంది. శివరాత్రి సందర్భంగా మారిషస్ లోని హిందువులు కాలినడకన ఇక్కడికి చేరుకుంటారు.

  • Loading...

More Telugu News