: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం మూసివేయండి... కోర్టు ఆదేశం
బీసీసీఐ, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్ సీఏ)కు మధ్య జరుగుతున్న ఘర్షణలో ఆర్ సీఏకు ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్ సీఏ) కార్యాలయాన్ని మూసివేయాలని జోధ్ పూర్ హైకోర్టు తాజాగా ఆదేశించింది. ఇటీవల మాజీ ఐపీఎల్ అధిపతి లలిత్ మోడీకి వ్యతిరేకంగా జనరల్ బాడీ సమావేశంలో ఆఫీస్ బేరర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆమోదం పొందింది. దాంతో, మోడీ ఆర్ సీఏ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో లలిత్ మోడీ గ్రూప్ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా కోర్టులో సవాల్ చేసింది. దాంతో, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాన్ని సీల్ చేయాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.