: పూనం పాండేకు మరింత ఊరట... పెండింగ్ కేసును కొట్టేసిన బెంగళూరు కోర్టు


బాలీవుడ్ నటి, సంచలన మోడల్ పూనం పాండేకు మరింత ఊరట లభించింది. ఆమెపై రెండేళ్లుగా కొనసాగుతున్న ఓ కేసును బెంగళూరు కోర్టు కొట్టివేసింది. హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముఖచిత్రంతో కూడిన విష్ణువు ఫొటోను పట్టుకుని అర్ధనగ్నంగా ఫొటోలకు ఫొజులిచ్చిన ఆమెపై బెంగళూరు కోర్టులో ఉమేశ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమెపై మత విశ్వాసాలకు భంగం కలిగించారన్న అభియోగంపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి 2012, నవంబర్ 7న పాండేకు కోర్టు సమన్లు కూడా జారీ చేసింది. తాజాగా పాండే న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి సాంకేతిక కారణాలను పేర్కొంటూ కేసును కొట్టివేశారు.

  • Loading...

More Telugu News