: రానున్న రోజుల్లో రుణ భారం మరింత పెరగనుంది... బడ్జెట్ ప్రసంగంలో యనమల


రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయని, రెవెన్యూ లోటు ఏర్పడిందని బడ్జెట్ ప్రసంగం సందర్భంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఆర్థిక సంఘం సిఫారసుల తర్వాత కూడా లోటు కొనసాగుతోందని చెప్పారు. లక్ష 20వేల కోట్ల మేర రాజధానికి నిధులు కోరగా, రెవెన్యూ లోటు కింద 22 వేల కోట్లు మాత్రమే ఆర్థిక సంఘం ఇచ్చిందని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో రుణ భారం మరింత పెరగనుందని స్పష్టం చేశారు. ఉద్యమాల వల్ల ఏపీ నష్టపోయిందని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని చెప్పారు. రాజధానిని కూడా నిర్ణయించకుండా రాష్ట్రాన్ని విడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News