: మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మిషన్ కాకతీయ' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నిజామాబాద్ లోని ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివపేటలో లాంఛనంగా మొదలైంది. కేసీఆర్ స్వయంగా తట్ట, పారను చేపట్టి పాతచెరువు పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించి విడుదల చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 46,447 పాత చెరువులను పునరుద్ధరించనున్నారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం 9,573 చెరువులకు పునరుద్ధరణ జరుగుతుంది.