: భారత జాలర్లను విడుదల చేయనున్న శ్రీలంక


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో 86 మంది భారత జాలర్లను విడుదల చేయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మారిషస్ పర్యటనలో ఉన్న ఆయన ఆ తర్వాత లంకలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో గతంలో అరెస్టుచేసిన వారిలో కొంతమంది జాలర్లను విడుదల చేయాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కార్యాలయం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 1987లో లంకలో రాజీవ్ గాంధీ పర్యటన తరువాత మళ్లీ తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని మోదీనే. గతేడాది తొలిసారి మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వచ్చిన అప్పటి లంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే కూడా కొంతమంది జాలర్లను విడుదల చేయించారు.

  • Loading...

More Telugu News