: శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఒమన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం మస్కట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ క్రమంలో నిర్వహించిన తనిఖీలో భాగంగా ఓ ప్రయాణికుడి నుంచి 58 తులాల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ధర పెరిగిన కొద్దీ విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా మితిమీరిపోతోంది. ఈ క్రమంలో ప్రతిరోజూ శంషాబాద్ విమానాశ్రయంలో ఎవరో ఒక ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుంటూనే వున్నారు.