: రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు
రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే వున్నాయి. శ్రీకాకుళం, విజయ నగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, చిత్తూరు, కృష్ణా, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరంలో జిల్లా బలరాంపురం, గంట్యాడలో పిడుగుధాటికి ముగ్గురు గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక తిరుపతి, భద్రాచలం, విజయవాడలో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో భారీ వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లాలో పిడుగుపడి వరి కుప్ప దగ్ధం అయింది. మరోవైపు అకాలంగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. వందలాది ఎకరాల్లో మామిడి, మిరప పంటకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.