: నిజాయతీపరుడైన మన్మోహన్ పేరును కోల్ స్కాంలోకి లాగారు: మాకెన్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కోల్ స్కాంలో సమన్లు జారీ చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిజాయతీపరుడైన ఆయన పేరును బొగ్గు క్షేత్రాల కేటాయింపుల స్కాంలోకి లాగారని, ఇది చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ అన్నారు. "మేమంతా (కాంగ్రెస్ నేతలు) ఐకమత్యంతో మన్మోహన్ సింగ్ వైపు నిలుస్తాం. ఆయనలాంటి నిజాయతీపరుడైన వ్యక్తి ఉండరని నేను చెప్పగలను. ఇది చాలా దురదృష్టకరం" అని మాకెన్ పేర్కొన్నారు. మన్మోహన్ నిజాయతీకి ఉన్నత న్యాయస్థానాలు క్లీన్ చిట్ ఇస్తాయని మరో కాంగ్రెస్ నేత అశ్వనీకుమార్ అన్నారు. ఉన్నత కోర్టులు న్యాయం చేస్తాయని నమ్ముతున్నామని ఢిల్లీలో చెప్పారు.