: మన్మోహన్ పై మోపిన నేరాలు నిజం కాదు: రేణుకా చౌదరి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మోపిన నేరాలు, ఆయనకు సమన్లు పంపడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖండించారు. మన్మోహన్ పై మోపిన నేరాలు నిజం కాదని, వాస్తవాలు బయటికొస్తాయని ఢిల్లీలో మీడియాతో అన్నారు. గతంలో మాజీ ప్రధాని వాజ్ పేయి కేటాయించిన కోల్ బ్లాక్ ల విషయంలో ఎవరూ ఇప్పుడు సవాల్ చేయడంలేదు కదా? అన్న ఆమె, నాడున్న నిబంధనల ప్రకారం మన్మోహన్ తీసుకున్న నిర్ణయం కరక్టేనని అతి త్వరలోనే బయటపడుతుందన్నారు. కానీ ఇలా రాజకీయ వివాదం సృష్టించి, ఏ విధంగా ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా తమను భయపెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అంతా ఐక్యతతో దాన్ని ఎదుర్కొంటుందని రేణుక పేర్కొన్నారు. ప్రస్తుతానికి విచారణ సక్రమంగా జరగాలని కోరుకుంటున్నామని, వాస్తవాలు తెలుసుకోకుండా ముందే ఏదీ మాట్లాడటం సరికాదన్నారు.