: ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్... భయంతోనే పారిపోయారన్న అధికారపక్షం
ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. గృహనిర్మాణంపై ప్రభుత్వ తీరుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పి వెళ్లిపోయారు. ఇందుకు సమాధానంగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, గృహనిర్మాణ అవకతవకలపై సభాసంఘం వేస్తామని చెప్పినప్పటికీ ప్రతిపక్ష నేత వాకౌట్ చేశారని, అందుకు అంగీకారం కూడా తెలపలేదన్నారు. ఒకవేళ సభాసంఘం వేస్తే వాళ్ల భండారాలు బయటపడతాయన్న భయంతో ప్రతిపక్ష నేత సభ నుంచి పారిపోయారని వ్యాఖ్యానించారు. తప్పకుండా సభాసంఘం వేసి తీరుతామని యనమల సభలో ప్రకటించారు.