: చంద్రబాబు 3డీ సినిమాకు బీ రెడీ: ఆనం


నేటి మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3డీ సినిమా చూపించబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు ఉదయం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నేడు అసెంబ్లీ ముందుకు రానున్న బడ్జెట్ పై వ్యాఖ్యానించాలని కోరగా ఆనం స్పందించారు. కాసేపట్లో చంద్రబాబు బడ్జెట్ 3డీ చిత్రాన్ని చూపుతారని, ఈ సినిమా చూడడానికి నిరుద్యోగులు, పెన్షన్ దార్లకు ఉచితంగా 3డీ అద్దాలను కూడా పంపిణీ చేస్తారని తనదైన శైలిలో అన్నారు. తిరుపతిలో ఇచ్చిన హామీలను మోదీ బుట్టదాఖలు చేశారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News