: మిషన్ కాకతీయకు నేడే శ్రీకారం... నిజామాబాదు జిల్లాలో ప్రారంభించనున్న కేసీఆర్


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ నిజామాబాదు జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని సదాశివనగర్ గ్రామ పంచాయతీలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. మరికొద్దిసేపట్లో హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో నిజామాబాదు జిల్లా పర్యటనకు ఆయన బయలుదేరనున్నారు. రాష్ట్రంలో వేలాది చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయను కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. చెరువుల పునరుద్ధరణ ద్వారా గ్రామాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. నిన్నటి బడ్జెట్ లోనూ ఈ పథకానికి భారీగా నిధులు కేటాయించారు.

  • Loading...

More Telugu News