: హైకోర్టు వద్ద కిడ్నాపైన చిన్నారి మౌనిక క్షేమం... గుంటూరులో కిడ్నాపర్ అరెస్ట్
హైదరాబాదులోని హైకోర్టు పరిసరాల్లో నిన్న అపహరణకు గురైన బాలిక మౌనిక సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. నిన్న మధ్యాహ్నం బాలికను అపహరించిన కిడ్నాపర్ హనుమంతరావు పరారయ్యాడు. బాలికను తీసుకుని అతడు నేరుగా గుంటూరు వెళ్లిపోయాడు. కిడ్నాపర్ కదలికలపై నిఘా వేసిన పోలీసులు ఎట్టకేలకు అతడిని గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ నుంచి రక్షించిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ హనుమంతరావును చార్మినార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.