: ఫొటోషూట్ కు అంగీకరించని సల్మాన్ ఖాన్... అధికారంతో ఒప్పించిన జిల్లా కలెక్టర్


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. తాజా చిత్రం 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' రాజస్థాన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. రాజ్ సముంద్ జిల్లాలోని చారిత్రక కుంభాల్ గఢ్ కోటలో పలు సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా, జిల్లా కలెక్టర్ కేసీ వర్మ సెట్స్ వద్దకు కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఎంతో ఆసక్తిగా అక్కడికి వచ్చిన ఆయనకు సల్మాన్ వైఖరి నచ్చలేదట. ఎందుకంటే, సల్మాన్ తో ఫొటోలు తీయించుకుంటామని తొలుత మర్యాదగానే అడిగాడట. అయితే, సల్లూ అందుకు అయిష్టత కనబర్చడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్లిపోవాలంటూ యూనిట్ కు హుకుం జారీచేశాడు. షూటింగ్ ఆగిపోతే నిర్మాతకు ఎంత నష్టం వస్తుందో తెలిసిిన సల్మాన్ తనే దిగివచ్చాడు. చివరికి కలెక్టర్ కుటుంబంతో ఫొటో షూట్ కు అంగీకరించాడు. దాదాపు అరగంటపాటు వారితో ఫొటోలు దిగాడు. అదే సమయంలో జిల్లా ఎస్పీ శ్వేతా ధన్ ఖడ్ కూడా అక్కడికి వచ్చారు. ఆమె సల్లూతో ముచ్చటించడం కనిపించింది.

  • Loading...

More Telugu News