: 'బాండ్' కోసం కొత్త అమ్మాయిని తీసుకువచ్చారు!


బ్రిటీష్ ఏజెంట్ జేమ్స్ బాండ్ సాహసకృత్యాలు అన్నీఇన్నీ కావు! ప్రపంచంలో ఏమూలకు వెళ్లైనా అసైన్ మెంట్ పూర్తి చేసుకురాగలడు! ప్రత్యర్థి ఎవరన్నది అతనికి అనవసరం... ఎదుటి వ్యక్తి చేతిలో ఎలాంటి ఆయుధాలున్నా నో ప్రాబ్లం! లిప్తపాటులో ప్రాణాలు తీయడం, నేర్పుగా తప్పించుకోవడం అతని స్పెషాలిటీ! జేమ్స్ బాండ్ సినిమాల్లో ఇలాంటివి సర్వసాధారణం. మరి అంతటి యోధానుయోధుడికి కాసింత ఉల్లాసం కల్పించేందకు కొందరు చలాకీ భామలు కూడా అందుబాటులో ఉంటారు. బాండ్ గా కొన్ని సినిమాల పాటు ఒకే నటుడిని కొనసాగించే బ్యానర్లు, బాండ్ బేబీల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కొత్తదనానికి పెద్దపీట వేస్తాయి. జేమ్స్ బాండ్ సిరీస్ లో తాజాగా నిర్మితమవుతున్న 'స్పెక్టర్' చిత్రంలోనూ కొత్త అమ్మాయిని తీసుకువచ్చారు. మెక్సికన్ నటి స్టెఫానీ సిగ్మన్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. మోనికా బెలూచి, లియా సిడౌక్స్ లతో కలిసి బాండ్ ను ఎంటర్టయిన్ చేయనుంది. సిగ్మన్ 'మిస్ బాలా', 'పయనీర్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. కాగా, స్కైఫాల్ చిత్రానికి దర్శకత్వం వహించిన శామ్ మెండెస్ 'స్పెక్టర్'కు దర్శకుడు. డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్ గా నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News