: వీళ్లు కూడా మూడు మ్యాచ్ ల దూరంలో ఉన్నారట!


వరల్డ్ కప్ లో టీమిండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో, కప్ ఎవరిదన్న విషయంలో ఎవరికివారే అంచనాలు వేసుకుంటున్నారు. కప్ కు 3 మ్యాచ్ ల దూరంలోనే ఉన్నామంటూ టీమిండియా సహా కొన్ని జట్లు ఇప్పటికే ధీమా వ్యక్తం చేశాయి. తాజాగా, సఫారీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కూడా అదే మాట అంటున్నాడు. తాము కప్ కు మరో మూడు మ్యాచ్ ల దూరంలో ఉన్నామని పేర్కొన్నాడు. అంతేకాదండోయ్, ఈ వరల్డ్ కప్ లో తమదే అత్యుత్తమ జట్టు అని 100 శాతం నమ్ముతున్నట్టు తెలిపాడు. గ్రూప్ దశలో రెండు ఓటములు కొంచెం బాధించినా, ఆ ఫలితాల గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని అన్నాడు. కప్ ఒడిసిపట్టేందుకు మరెంతో దూరంలో లేమని ఏబీ పేర్కొన్నాడు. ఎంతటి స్కోరునైనా ఛేదించగలమన్న నమ్మకం ఉందన్నాడు.

  • Loading...

More Telugu News