: ఆప్ కార్యాలయంపై దాడి... ఆడియో టేపుల ఫలితమేనా?
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఢిల్లీలోని పటేల్ నగర్ లో ఉన్న ఆప్ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ తీవ్ర ఆరోపణలు చేసిన అనంతరం మహారాష్ట్ర ఆప్ కన్వీనర్, కార్యదర్శి రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆప్ కార్యాలయంపై దాడులు జరిగాయి. కాగా, పదవిని కాపాడుకునేందుకు కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని చీల్చాలని భావించారని రాజేష్ గార్గ్ ఆరోపిస్తూ, ఆడియో టేపులను విడుదల చేశారు. దీంతో ఆప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.