: పరీక్షల టైం... రేపు బస్సు డిపోల ఎదుట ఆర్టీసీ ఆందోళన


ఆర్టీసీ కార్మికులు వేతన సవరణపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులకు తాయిలాలు ప్రకటించి తమను నిర్లక్ష్యం చేయడంపై ఆర్టీసీ ఆందోళన బాట పట్టనుంది. ఈ మేరకు ఆర్టీసీకి నోటీసులిచ్చిన ఈయూ, టీఎంయూ సంఘాల నేతలతో అధికారులు చర్చలు చేపట్టారు. వేతన సవరణ, ఆర్టీసీ విభజన డిమాండ్లతో రేపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని బస్సు డిపోల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఈ నెల 24న బస్ భవన్ ముట్టడికి యూనియన్లు ముహూర్తం నిర్ణయించాయి. కాగా, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా, పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ దశలో ఆర్టీసీ ఆందోళన చేపట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News