: అవినాష్ కోసం 12 బృందాలతో వెతుకులాట
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడి, వారిపై దాడి చేసి పరారీలో ఉన్న అవినాష్ ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 12 బృందాలను ఎస్పీ రవిప్రకాశ్ రంగంలోకి దించారు. అవినాష్ సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా అవినాష్ తల్లి, సోదరిలను పోలీసుల ప్రశ్నిస్తున్నారు. ఖమ్మంలోని భద్రాచలంలో గల అవినాష్ నివాసం, హైదరాబాదులోని పలు ప్రదేశాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. అవినాష్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.