: ప్రత్యేక హోదాపై అఖిల పక్షం వేయాలి: రామకృష్ణ


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురంలో నిర్వహించిన ఆందోళన అనంతరం ఆయన పోలీసు స్టేషన్ లో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రధాని వద్దకు స్వయంగా తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రుల ఇళ్ల ఎదుట కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని ఆయన నినదించారు.

  • Loading...

More Telugu News