: బీసీలను ఏకం చేసి కేసీఆర్ సర్కార్ పై ఉద్యమిస్తాం: ఆర్.కృష్ణయ్య
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ బీసీల వ్యతిరేక బడ్జెట్ అని స్పష్టం చేశారు. చేతి వృత్తుల వారికి పెద్దగా కేటాయింపులు లేవని మండిపడ్డారు. జనాభా దామాషా పద్ధతిన బీసీలకు రూ. 10వేల కోట్లను కేటాయించాలని అన్నారు. లేకపోతే బీసీలు పన్నులు కట్టరని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీలందరినీ ఏకం చేసి ఉద్యమిస్తామని చెప్పారు.