: విటమిన్ డి ఎక్కువైనా, మరీ తక్కువైనా గుండెపోటు ముప్పు అధికమట!
రక్తంలో విటమిన్ డి శాతం అధికమైన వ్యక్తుల్లో గుండెపోటు ముప్పు అధికమని డెన్మార్క్ లోని యూనివర్సిటీ అఫ్ కోపెన్ హాగెన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. సూర్యరశ్మి శరీరంపై పడడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుందన్నది తెలిసిన విషయమే. లీటరు రక్తంలో విటమిన్ డి 50 నానోమోల్ కన్నా తక్కువైనా 100 నానోమోల్ కన్నా ఎక్కువైనా గుండెపోటు ముప్పు పెరుగుతుందని వర్శిటీ ప్రొఫెసర్ పీటర్ ష్వార్జ్ వివరించారు. గడచిన ఏడేళ్లలో మొత్తం 2.47 లక్షల మందిలో విటమిన్ డి పరిమాణాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని కనుగొన్నామని, ఈ సమయంలో 16,645 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. వీరి మరణానికి కారణాలు అన్వేషించామని, డి విటమిన్ లోపాల కారణంగా 100 మందికి పైగా చనిపోయినట్టు గుర్తించామని పేర్కొన్నారు.