: మిమ్మల్ని కడిగేస్తా... ముందు నీ మురికి కడుక్కో... జగన్, అచ్చెన్నాయుడు వాగ్యుద్ధం


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, తెలుగుదేశం మంత్రి అచ్చెన్నాయుడు మధ్య వాడీవేడిగా వాగ్యుద్ధం జరిగింది. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష నేత మాట్లాడకపోవటం ఇదే తొలిసారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడంతో రభస మొదలైంది. ఆయన వ్యాఖ్యలను వైకాపా నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, వైకాపా ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు తాను మైక్ ఇవ్వడం లేదని చంద్రబాబు చేసిన ఆరోపణలను గుర్తు చేశారు. దాన్ని బట్టి బడ్జెట్ పై తాను ఎంత మాట్లాడి ఉంటానో అర్థం చేసుకోవచ్చన్నారు. "రాబోయే అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో మిమ్మల్ని కడిగి పారేస్తా, కడిగించుకోండి" అని వైఎస్ జగన్ అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుంటూ "మమల్ని కడగడం తరువాత... ముందు మీకంటిన అవినీతి మురికి కడుక్కోండి... ఎంత కడిగినా అది పోదు" అన్నారు.

  • Loading...

More Telugu News