: అధ్యక్షా... మీకెందుకీ పక్షపాతం?: కోడెలపై జగన్ గుస్సా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైకాపా నేత వైఎస్ జగన్ అసహనాన్ని ప్రదర్శించారు. అధికార తెలుగుదేశం పార్టీకి అధికంగా అవకాశాలు ఇస్తూ, తమ సభ్యులకు తక్కువ సమయం ఇస్తున్నారని ఆరోపించారు. "అధ్యక్షా... మీకెందుకీ పక్షపాతం? మావాళ్ల ప్రసంగాలు జరుగుతున్నప్పుడు అధికార సభ్యులు ఎప్పుడు కల్పించుకుంటున్నా మైక్ ఇస్తున్నారు. వారు ప్రత్యక్ష ఆరోపణలు చేసినా మా సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదు. ఇది పక్షపాతం కాదా? అని నేను అడుగుతున్నాను అధ్యక్షా" అన్నారు. "మీ తీరు సరికాదు... స్పీకర్ స్థానంలో టీడీపీ సభ్యుడిగా మీరు కూర్చున్నట్టు ఉంది" అన్నారు. డోన్ ఎంఎల్ఏ రాజేంద్రనాథ్ ప్రసంగిస్తున్నప్పుడు పలువురు తెలుగుదేశం నేతలు అడ్డుకోగా జగన్ కల్పించుకున్నారు.