: సమన్ల జారీపై చింతిస్తున్నా: మన్మోహన్ సింగ్
బొగ్గు స్కాంలోని హిందాల్కో కేసులో ఈరోజు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేయడంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. ఈ కేసులో తొలిసారి మాట్లాడిన ఆయన, సమన్ల జారీపై చింతిస్తున్నానన్నారు. అయితే ఇది కేవలం జీవితంలో భాగమేనని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను చట్టపరమైన పరిశీలనకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. యూపీఏ-2 హయాంలో రెండవసారి ప్రధాని అయిన మన్మోహన్ అప్పట్లో బొగ్గు శాఖను ఆయనే పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో హిందాల్కో సంస్థకు బొగ్గు క్షేత్రాల కేటాయింపులు సిఫారసులతో జరిగినట్టు బయటపడటంతో మన్మోహన్ ఇరుక్కున్నారు.