: ఏపీలో ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం కల్పిస్తాం: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగ అవకాశమిస్తామని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో తెలిపారు. నైపుణ్యాభివృద్ధితో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. వైఎస్ హయాంలో ఫీజురీయంబర్స్ మెంట్ పేరుతో ఇంజినీరింగ్ కళాశాలలకు దోచి పెట్టారని మంత్రి విమర్శించారు. ఆదర్శ రైతుల వ్యవస్థ తొలగించి, వ్యవసాయ విస్తరణాధికారులను నియమించినట్టు సభకు తెలిపారు.