: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్... పార్ట్-1


2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు ఇవే... * తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ. 1,15,689 కోట్లు * ప్రణాళికేతర వ్యయం రూ. 63,306 * ప్రణాళికా వ్యయం రూ.52,383 * రెవెన్యూ మిగులు రూ. 531 కోట్లు * కేంద్ర పన్నుల వాటా 12,823 కోట్లు * ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ * తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడమే ఈ బడ్జెట్ లక్ష్యం * యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ. 100 కోట్లు * హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 416 కోట్లు * హైదరాబాద్ నీటి సరఫరాకు రూ. 1000 కోట్లు * అమరవీరులకు రూ. 48.12 కోట్లు * తెలంగాణ వాటర్ గ్రిడ్ కు రూ. 4వేల కోట్లు * రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధికి రూ. 2,421 కోట్లు * గ్రేటర్ హైదరాబాదుకు రూ. 526 కోట్లు * విద్యుత్ శాఖకు రూ. 7,400 కోట్లు * పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ. 974 కోట్లు * అటవీ, పర్యావరణ శాఖకు రూ. 325 కోట్లు * విద్యారంగానికి రూ. 11,216 కోట్లు * ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు రూ. 22,889 కోట్లు * మిషన్ కాకతీయ, సాగునీటి శాఖకు రూ. 8,500 కోట్లు * మైనార్టీ సంక్షేమానికి రూ. 1,105 కోట్లు * పశు, ఉద్యాన, వ్యవసాయ వర్శిటీలకు రూ. 261 కోట్లు * వైద్య శాఖకు రూ. 4,932 కోట్లు * వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 2,432 కోట్లు * ఆహార భద్రత, సబ్సిడీలకు రూ. 2,200 కోట్లు * స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 771 కోట్లు * బీడీ కార్మికుల సంక్షేమానికి రూ. 188 కోట్లు

  • Loading...

More Telugu News