: మా రాష్ట్రంలో ప్రవీణ్ తొగాడియాకు ప్రవేశం లేదు... కర్ణాటక హోంశాఖ మంత్రి కేజే జార్జి


విశ్వహిందూ పరిషత్ అగ్రనేత ప్రవీణ్ భాయ్ తొగాడియాకు కర్ణాటకలో ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జి వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిన్నటి మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పుత్తూరు తదితర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో తొగాడియా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, వాటి కారణంగా ఆయా ప్రాంతాల్లో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ తరహా మత ఘర్షణలు చోటుచేసుకోరాదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఇందులో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News