: చిత్తూరు జిల్లాలో విషాదం... రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
చిత్తూరు జిల్లాలో కొద్దిసేపటి క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతున్న ఇద్దరు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. జిల్లాలోని మొలకలచెరువు మండలంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో విద్యార్థుల బైక్ ను ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాతకోట దళితవాడకు చెందిన అనిల్ కుమార్, అంజి అనే విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు.