: గుడుంబా తనిఖీకి వెళితే రూ.80 లక్షల నగదు దొరికింది... గుట్టుగా తరలిస్తున్న రాజస్థానీల అరెస్ట్
గుడుంబా తయారీని అడ్డుకునేందుకు వెళ్లిన అబ్కారీ శాఖ అధికారులు, నోట్ల కట్టలు చూసి నోరెళ్లబెట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా గుట్టుగా ఆటోలో తరలిస్తున్న రూ.80.30 లక్షల నగదును అబ్కారీ శాఖకు చెందిన హైదరాబాదు జిల్లా సిబ్బంది స్వాధీనం చేసుకుని ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. నగదును తరలిస్తున్న ఇద్దరు రాజస్థానీలను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకెళితే... నిన్న నాంపల్లి సమీపంలోని మల్లేపల్లిలో గుడుండా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపేందుకు అబ్కారీ శాఖ సిబ్బంది బయలుదేరారు. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఓ ఆటోను నిలిపి తనిఖీ చేశారు. అందులో సారాకు బదులు నగదు బయటపడింది. నగదుకు సంబంధించి రాజస్థానీలు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.